తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బైక్‌ అదుపుతప్పి కిందపడ్డ యువకుడు.. చికిత్స పొందుతూ మృతి - nalgonda latest news

ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిన ఘటనలో తీవ్ర గాయాపాలైన యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన తక్కెళ్లపాడు గ్రామం వద్ద చోటుచేసుకుంది.

a-man-died-after-falling-off-a-motorcycle-at-takkellapadu-village-kattangur-mandal-nalgonda-district
బైక్‌ అదుపుతప్పి కిందపడ్డ యువకుడు.. చికిత్స పొందుతూ మృతి

By

Published : Jun 29, 2020, 11:05 PM IST

నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన సిరిగంప సతీశ్‌ (28) ద్విచక్ర వాహనంపై ఈదులూరు గ్రామానికి వెళ్తున్నాడు. తక్కెళ్లపాడు గ్రామం వద్ద రోడ్డుపై గుంతలు ఉండటం వల్ల బైక్‌ అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయాపడ్డ అతన్ని నల్లగొండలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. సాయంత్రం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details