మహబూబాబాద్ జిల్లా కురవి మండలం రేకుల తండాకు చెందిన బానోతు ధారాసింగ్(58) అనే వ్యక్తి రోజూలాగే వ్యవసాయ పనులకు కూలిగా వెళ్లాడు. పొలంలో గట్లు చెక్కుతున్న క్రమంలో ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అదే సమయంలో పెద్ద శబ్దం చేస్తూ పిడుగు పడింది.
పిడుగుపాటుకు వ్యవసాయ కూలీ మృతి - మహబూబాబాద్ జిల్లా నేరవార్తలు
వ్యవసాయ పనులు చేస్తున్న ఓ వ్యక్తిపై పిడుగుపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా రేకుల తండాలో చోటుచేసుకుంది.
పిడుగుపాటుకు వ్యవసాయ కూలీ మృతి
పొలం పనులు చేస్తున్న ధారాసింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటి పెద్ద మరణంతో కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.