ఏపీలోని కర్నూలు జిల్లా రుద్రవరం మండలం కొట్టాల గ్రామానికి చెందిన యువకుడు దస్తగిరి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడు జల్సాలకు అలవాటు పడి... విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసేవాడని పోలీసులు అన్నారు. కొన్ని నెలల క్రితం రెండు ద్విచక్ర వాహనాలు, ఓ కారును అప్పు చేసి కొనుగోలు చేశాడని, నెలనెలా వాటికి సంబంధించిన కిస్తీలు కట్టేవాడని తెలిపారు. ఈ మధ్య కిస్తీలు కట్టలేక సోమవారం ఇంటి నుంచి వెళ్లిపోయాడని పేర్కొన్నారు. అతడి కోసం బంధువులు గాలించారని వెల్లడించారు.
జల్సాలతో అప్పుల పాలయ్యాడు... చివరకు ప్రాణాలు తీసుకున్నాడు - జల్సాలతో అప్పులపాలైన యువకుడు అత్మహత్య !
జల్సాలే అతని పాలిట యమపాశమయ్యాయి. స్థోమతకు మించిన ఖర్చులు, విచ్చలవిడి జల్సాలు చేసి అప్పులపాలయ్యాడు ఓ యువకుడు. చేసేది లేక చివరకు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా రుద్రవరం మండలం కొట్టాల గ్రామంలో జరిగింది.
జల్సాలతో అప్పుల పాలయ్యాడు... చివరకు ప్రాణాలు తీసుకున్నాడు
సిరివెళ్లకు సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో అతడి మృతదేహం బుధవారం తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి శవ పరీక్ష కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి మురళీ మోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై సూర్య మౌళి తెలిపారు.
ఇదీ చూడండి:వారం రోజుల్లో పెళ్లి... యువకుడు బలవన్మరణం