కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన పోతు కిషోర్ ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కిషోర్.. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేసేవాడు. లాక్డౌన్ కారణంగా మార్చిలో పాఠశాలను మూసివేశారు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య - kamaredde district latest news
కరోనాతో మధ్య తరగతి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కుటుంబ పోషణ భారమై ప్రైవేటు ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన పోతు కిషోర్.. ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
అనంతరం కిషోర్ స్వగ్రామమైన దోమకొండకు వచ్చాడు. ఎలాంటి ఉపాధి లేక స్వగ్రామంలోనే ఉంటున్నాడు. కుటుంబ పోషణ కోసం కిషోర్ అప్పులు చేశాడు. అలాగే ఇటీవల భార్య ఆపరేషన్ నిమిత్తం సుమారు లక్షా 50 వేలు ఖర్చు అయింది. ఆ డబ్బులు కూడా కిషోర్ అప్పుగా ఇతరుల వద్ద నుంచి తీసుకువచ్చాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక కిషోర్ బలవన్మరణానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు.
ఇవీ చూడండి:హైదరాబాద్లోని చెరువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్