ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల చిన వెంకన్న ఆలయ మాధవకుంట పుష్కరిణిలోకి ఓ వ్యక్తి దూకాడు. ఆ వ్యక్తి చాలాసేపటి వరకు పైకి రాకపోవడం వల్ల స్థానికులు.. పోలీసులు, దేవస్థానం సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఆలయ సిబ్బంది, పోలీసులు పుష్కరిణిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈతగాళ్ల సహాయంతో అతని మృతదేహాన్ని బయటకు తీశారు.
ద్వారక తిరుమల పుష్కరిణిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
ఆంధ్రప్రదేశ్లోని ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పుష్కరిణిలో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే అతడు పుష్కరిణిలో దూకే సమయంలో వద్దని స్థానికులు కేకలు వేసినా పట్టించుకోలేదని, నిన్నటినుంచి ఆ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని పోలీసులు తెలిపారు. మృతుడు మతిస్తిమితం లేని వ్యక్తిగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అతన్ని పెదపాడుకు చెందిన వీరాంజనేయులుగా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు... మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:గుడి దొంగలను పట్టుకున్న లంగర్ హౌస్ పోలీసులు