మద్యానికి డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో జరిగింది. ఎస్సై సత్యనారాయణ తెలిపిన ప్రకారం... పట్టణంలోని చైతన్యపురి కాలనీకి చెందిన దారంగుల దుర్గయ్య(55) ఇతరుల వద్ద పశువుల కాపరిగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల మద్యానికి బానిస అయ్యాడు. తెలిసిన వారి దగ్దర చాలా చోట్ల అప్పులు చేశాడు. భార్య లక్ష్మిని మద్యానికి డబ్బులు కావాలని అడిగాడు. తన దగ్గర లేవని చెప్పింది. ఇతరుల వద్ద అప్పుకోసం ప్రయత్నం చేయగా.. ఎక్కడా దొరకలేదు. రెండు రోజుల క్రితం తాను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నా అని చెప్పి వెళ్లాడు.
మందుకు పైసలివ్వలేదని వ్యక్తి ఆత్మహత్య - వ్యక్తి ఆత్మహత్య
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్ఠణంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య
ఎప్పుడు ఇలానే వెళ్తాడు.. తర్వాత వస్తాడులే అని కుటుంబసభ్యులు అనుకున్నారు. దీంతో విసుగుచెందిన దుర్గయ్య సమీపంలో గల గురుకుల పాఠశాల వెనుక చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలనీ వాసులు అటువైపు వంట చెరుకు కోసం వెళ్లగా చెట్టుకు ఉరేసుకుని ఉండడం చూసి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. కుమారుడు శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.
ఇవీ చూడండి: ఆగి ఉన్న ట్రాక్టర్ను వెనక నుంచి ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు