తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఘరానా మోసం.. రైతుల నుంచి రూ.2 లక్షలు స్వాహా

అమాయకులైన రైతుల నుంచి రూ.2 లక్షలకు టోకరా పెట్టి పరారయ్యాడు ఓ యువకుడు. గ్రామస్థులకు ఫించన్లు, బ్యాంకు లోన్లు, పట్టా పాసు పుస్తకాలు ఇప్పిస్తానని నమ్మించి ఉడాయించాడు. సొంత గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో నమ్మామని, కానీ ఇంత మోసం చేస్తాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామ రైతులు.

ఘరానా మోసం.. రైతుల నుంచి రూ.2 లక్షలు స్వాహా
ఘరానా మోసం.. రైతుల నుంచి రూ.2 లక్షలు స్వాహా

By

Published : Jul 15, 2020, 8:46 PM IST

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లిలో ఓ యువకుడు ఘరానా మోసానికి పాల్పడ్డాడు. రైతులకు, గ్రామస్థులకు ఫించన్లు, బ్యాంకు లోన్లు, పట్టా పాసు పుస్తకాలు ఇప్పిస్తానని నమ్మించాడు. వేలు ముద్రలు తీసుకుని బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బులు డ్రా చేసుకుని ఉడాయించాడు.. అదే గ్రామానికి చెందిన దూశెట్టి భాస్కర్ అనే యువకుడు. మొత్తం రూ.2 లక్షలు రైతులకు టోకరా పెట్టి పరారయ్యాడు. బ్యాంకు వద్దకు వెళ్లి తమ ఖాతాల్లో ఉన్న సొమ్మును చూసుకోగా.. అకౌంట్​లో డబ్బులు లేకపోవడంతో, మోసపోయామని తెలుసుకున్న బాధితులు, పోలీసులను ఆశ్రయించారు.

మొత్తం ఐదుగురు రైతుల నుంచి రూ.2,02,000 ఆన్​లైన్​ నుంచి విత్​డ్రా చేసుకున్నాడు. సొంత గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో నమ్మామని, కానీ ఇంత మోసం చేస్తాడని ఊహించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details