వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట దర్గా ప్రాంతానికి చెందిన బానోతు రాకేశ్ మద్యానికి బానిసయ్యాడు. గురువారం సాయంత్రం మద్యం సేవించిన అతను.. మరింత తాగడానికి డబ్బుల కోసం ఇంట్లో వారితో గొడవపడ్డాడు. వారు డబ్బులు లేవని చెప్పటంతో కోపోద్రిక్తుడై తన ద్విచక్ర వాహనాన్ని రహదారిపై నిలిపి నిప్పంటించాడు.
తన ద్విచక్ర వాహనాన్ని తానే తగలబెట్టుకున్న వ్యక్తి - వరంగల్ అర్బన్ జిల్లా లేటెస్ట్ వార్తలు
మద్యం మత్తులో ఒక వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని తానే తగలబెట్టిన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట దర్గా ప్రాంతంలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

తన ద్విచక్ర వాహనాన్ని తానే తగలబెట్టుకున్న వ్యక్తి
ఈ ఘటనలో ద్విచక్ర వాహనం పూర్తిగా దగ్ధమవగా... కొంతసేపు వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. రాకేశ్ మద్యం మత్తులో గతంలోనూ ఒక ద్విచక్ర వాహనాన్ని ఇలాగే తగలబెట్టినట్లు స్థానికులు తెలిపారు. ఇతనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ కూడా నమోదై ఉన్నట్లు సమాచారం.
తన ద్విచక్ర వాహనాన్ని తానే తగలబెట్టుకున్న వ్యక్తి
ఇదీ చదవండి:రహదారిపై 3 వాహనాల బీభత్సం.. ముగ్గురు యువకులు మృతి