తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మతిస్తిమితం లేని యువకుడిపై దాడి - మతిస్తిమితం లేని యువకుడిపై దాడి

మతిస్తిమితం లేని యువకుడిని గ్రామ పంచాయతీ ముందు చేతులు కట్టేసి కొట్టిన ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్​లో శనివారం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్నవారు ఈ ఘటనను సెల్​ఫోన్​లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్​ చేశారు.

a man attack on mentally disturbed young man in nirmal district
మతిస్తిమితం లేని యువకుడిపై దాడి

By

Published : Nov 8, 2020, 8:21 PM IST

నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్​లో దారుణం చోటుచేసుకుంది. మతిస్తిమితం లేని లక్కవత్తుల రాజు అనే యువకుడిపై అదే గ్రామానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి కొడుకు.. చేతులు కట్టేసి శనివారం కర్రతో చితకబాదాడు. ఈ దృశ్యాలను కొందరు సెల్​ఫోన్​లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్​ చేశారు.

ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు దాడి చేసిన ఆకుల శ్రీనివాస్, ఎనగంటి శేఖర్, నర్సవ్వపై కేసు నమోదు చేశారు. మహిళను దూషించాడన్న ఆరోపణపై దెబ్బలుతిన్న వ్యక్తి రాజుపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మతిస్తిమితం లేని యువకుడిపై దాడి

ఇదీ చదవండి:చిన్నారిపై 'వేధింపులు'.. ఆటోడ్రైవర్​కు మహిళలు దేహశుద్ధి

ABOUT THE AUTHOR

...view details