సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం పెద్దనెమలిలో మహేందర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ఫోన్ చేసి తరచూ వేధిస్తున్నాడు. యువతి సోదరుడు రాము, మహేందర్‌ను మందలించాడు. కక్ష పెంచుకున్న మహేందర్ తన సహచరులతో కలిసి యువతి తరఫు బంధువుల ఇళ్లపై ఆయుధాలతో దాడి చేశారు.
మందలించినందుకు దాడి చేశారు - latest crime news in telangana
ఓ యువతికి ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడిన యువకుడిని మందలించిపందుకు యువతి కుటుంబ సభ్యులపై దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా పెద్దనెమలిలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.
మందలించినందుకు దాడి చేశారు
దాడిలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరికి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల హైదరాబాద్‌కు తరలించారు. యువతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీ చూడండి: కరోనా కేసుల పెరుగుదలకు కారణాలివే!