మెదక్ జిల్లా నిజాంపేట మండలకేంద్రానికి చెందిన బోయిని శ్రీనివాస్... అతని భార్య కనకవ్వలపై అదే గ్రామానికి చెందిన తమ్మల ప్రభాకర్ కత్తితో దాడి చేశాడు. పాతకక్షలతోనే దాడికి పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు.
పాతకక్షలతో... దంపతులపై కత్తితో దాడి - తెలంగాణ వార్తలు
మెదక్ జిల్లా నిజాంపేటలో దంపతులపై... పాతకక్షలతో ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. గ్రామానికి చెందిన బోయిని శ్రీనివాస్ అతని భార్య కనకవ్వలపై అదే గ్రామానికి చెందిన తమ్మల ప్రభాకర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
పాతకక్షలతో... దంపతులపై కత్తితో దాడి
కత్తి దాడిలో భార్యాభర్తలకు గాయాలు కాగా... వారిని రామాయంపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:ఇప్పుడే వస్తానని చెప్పి అదృశ్యమైంది..!