సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్నగర్కు చెందిన ఖాదర్, సయ్యద్ ఎదురెదురు ఇళ్లల్లో ఉంటారు. ఇరువురి మధ్య జరిగిన ఘర్షణలో ఖాదర్.. సయ్యద్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో సయ్యద్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ఇద్దరి మధ్య ఘర్షణ... కత్తితో దాడికి దారితీసింది
ఎదురెదురు ఇళ్లల్లో ఉండే ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ కత్తితో దాడికి దారితీసింది. ఈ ఘటన సిద్దిపేట పట్టణంలోని ఎన్టీఆర్నగర్లో జరిగింది.
ఇద్దరి మధ్య ఘర్షణ... కత్తితో దాడికి దారితీసింది
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితున్ని సిద్దిపేట ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. దాడికి పాల్పడిన నిందితున్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.