తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పురుగుల మందు తాగి అత్త, అల్లుడు ఆత్మహత్యాయత్నం - వనపర్తి జిల్లా తాజా వార్తలు

వనపర్తి జిల్లా మదనాపురం మండలం దుప్పల్లి సమీపంలో... ఓ యువకుడు, వివాహిత పురుగుల మందుతాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఇద్దరిని వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు.

a man and women attempted suicide by insecticid
పురుగుల మందు తాగి అత్త, అల్లుడు ఆత్మహత్యాయత్నం

By

Published : Jul 18, 2020, 4:23 AM IST

వనపర్తి జిల్లా మదనాపురం మండలం స్కూల్​తండాకు చెందిన శివ(25), పార్వతి(30)... వరుసకు అత్త, అల్లుడు అవుతారు. దుప్పల్లి సమీపంలో కొన్నూర్​కు వెళ్లేదారిలో ఇద్దరు పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. రహదారిపై వెళ్తున్న ప్రయాణికులు వాళ్లను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కొనఊపిరితో ఉన్న ఇద్దరిని వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యా యత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details