ప్రసవం కోసం వచ్చిన మహిళ.. ఆక్సిజన్ అందక మృతిచెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకొంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురానికి చెందిన సంధ్యారాణి.. కాన్పు కోసం వనపర్తి పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఆదివారం.. ఆమెకు శస్త్ర చికిత్స చేసి మగ బిడ్డను బయటకు తీశారు. ఆ సమయంలో తల్లీబిడ్డ పరిస్థితి విషమంగా మారింది.
మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు అంబులెన్స్‌లో అలంపూర్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. దారి మధ్యలో ఆక్సిజన్ అయిపోవడం వల్ల మహిళ పరిస్థితి మరింత విషమించింది. అనంతరం ఆస్పత్రికి చేరుకున్నాక.. వైద్యులు పరీక్షలు చేసి.. మరణించిందని నిర్ధారించారు.