పెళ్లి చేసుకొని మోసం చేసి, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని నిలదీసినందుకు బాధితురాలిపై హత్యాయత్నానికి పాల్పడింది ఓ ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడిన బాధితురాలు ఐద్వా సంఘానికి తన గోడు వెల్లబోసుకుంది.
నిజామాబాద్‌కి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనంతరాజ్ ఓ మహిళా ఉద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. బాధితురాలి నెల జీతం వాడుకోవడమే కాకుండా, నూతన ఇంటి నిర్మాణం కోసం ఆమె పేరు మీద బ్యాంకు లోన్ తీసుకున్నాడు. భవిష్యత్తులో ఆమెని మోసం చేయాలని భావించి భార్య పేరు మీద వ్యక్తిగత లోన్ తీసుకున్నాడు. ఇవన్నీ చేశాక బెంగళూరుకి చెందిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు ఇదేంటని నిలదీసి కేసు పెట్టింది. కేసు వెనక్కి తీసుకోవాలని బాధితురాలిపై అనంతరాజ్ అన్న, అక్కలు, రెండో భార్య తండ్రి కలిసి ఆమెని ఆర్యనగర్‌లోని తన ఇంట్లో నిర్బంధించి బెదిరించారు. బాధితురాలిపై దాడికి పాల్పడి ఒంటిపై ఉన్న 5 తులాల బంగారం లాక్కున్నారు.
మీడియా సహకారంతో