తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

నకిలీ పత్రాలతో భూకబ్జాలు.. ముఠా ఆట కట్టించిన పోలీసులు - Hyderabad CP Anjani Kumar

నకిలీ పత్రాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్న ఏడుగురిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

Hyderabad Commissioner Anjani Kumar
హైదరాబాద్​లో నకిలీ పత్రాలు సృష్టిస్తున్న ముఠా అరెస్టు

By

Published : Dec 12, 2020, 4:46 PM IST

నకిలీ భూ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేసినట్లు హైదరాబాద్​ నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. 14 మంది గల ఈ ముఠాలో 7గురిని అరెస్టు చేయగా మరో ఏడుగురు పరారీలో ఉన్నారని సీపీ పేర్కొన్నారు.

హైదరాబాద్​లో నకిలీ పత్రాలు సృష్టిస్తున్న ముఠా అరెస్టు

అరెస్టైన వారి నుంచి 92 నకిలీ భూపత్రాలు, 13 రబ్బరు స్టాంప్‌లు 5 ఇంకు రిమోవర్స్‌ సీసాలు 2లక్షల 10వేల నగదు, 6 చరవాణీలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు. ఖాళీగా ఉన్న భూములను గుర్తించి నకిలీ పత్రాలు సృష్టించి మోసాలకు పాల్పడుతున్నారని టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి తెలిపారు. బాధితులు, స్థానికుల సమాచారం మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనూ ఆరా తీస్తే నకిలీ పత్రాలుగా తేలిందన్నారు. పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

ఇదీ చూడండి :మంత్రి ఈటలను కలిసిన మాజీ మంత్రి గీతారెడ్డి..

ABOUT THE AUTHOR

...view details