తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పురుగుల మందు తాగి మిర్చి రైతు బలవన్మరణం - ప్రకాశం జిల్లా నేర వార్తలు

నివర్ తుపాను మిర్చి రైతుల పాలిట శాపంగా మారింది. తుపాను ప్రభావంతో తీవ్ర పంట నష్టం జగడంతో మనస్తాపానికి గురైన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా చిన్ననందిపాడులో చోటు చేసుకుంది.

పురుగుల మందు తాగి మిర్చి రైతు బలవన్మరణం
పురుగుల మందు తాగి మిర్చి రైతు బలవన్మరణం

By

Published : Dec 15, 2020, 8:28 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చిన్ననందిపాడుకు చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాధినేని రమేష్ అనే రైతు ఈ ఏడాది 30 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. నివర్ ప్రభావంతో మిరప, శనగ, పొగాకు పంట పూర్తిగా దెబ్బతింది. ఫలితంగా మనస్తాపానికి గురైన రమేష్​ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాను ప్రభావంతో ఇప్పటికే మూడు సార్లు మిరప మొక్కలు నాటాడు. మళ్లీ నాటేందుకు అప్పులు చేయలేక, ఉన్న అప్పులతో ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురైనట్లు బంధువులు తెలిపారు.

ధైర్యం చెప్పారు.. అంతలోనే ఆత్మహత్య

నీటమునిగిన పంటలను పరిశీలించేందుకు గత నెల 29న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు చిన్ననందిపాడుకు వచ్చారు. ఈ సందర్భంగా రమేశ్​ పొలాన్ని పరిశీలించి ధైర్యం చెప్పారు. అయినప్పటికీ అతను ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇదీ చదవండి:ఘోర ప్రమాదం: లారీ ఢీకొని నలుగురు చిన్నారులు మృతి

ABOUT THE AUTHOR

...view details