తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విషాదం: నాటు బాంబు నోట్లో పేలి ఆవు మృతి - chittor news

సకల దేవతారూపంగా పూజించే గోమాతలు కొందరి అనాగరిక చేష్టల వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయి. ఏపీ చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం చందమామపల్లెలో విషాదం చోటు చేసుకుంది. వేటగాళ్లు అడవి పందుల కోసం పెట్టిన నాటుబాంబు తినేందుకు యత్నించి ఆవు మృతి చెందింది.

a-cow-was-died-in-a-bomb-exploded-at-chandamamapalli
విషాదం: నాటు బాంబు నోట్లో పేలి ఆవు మృతి

By

Published : Oct 7, 2020, 6:59 PM IST

వేటగాళ్లు వన్యప్రాణుల కోసం పెట్టిన నాటుబాంబు పేలి ఆవు మృతి చెందింది. తిరుపతి గ్రామీణ మండలం చందమామపల్లెలో పాడిరైతు రాంబాబు తన ఆవును మేత కోసం సమీపంలోని అటవీప్రాంతంలోకి తీసుకెళ్లాడు. మేత కోసం వెళ్లిన ఆవు నాటుబాంబుతో పెట్టిన పండును కొరకడం వల్ల బాంబు పేలింది. ఆవు నోటి భాగం ఛిద్రం కాగా... విషయం తెలిసిన స్థానికులు వెంటనే పశువైద్యుడికి సమాచారం అందించారు. వైద్యుడు సకాలంలో చేరుకుని ఆవుకు తగిన చికిత్స చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది.. గోమాత వేదనతో మృతి చెందింది.

ఇంతక ముందు..

గతంలో జిల్లాలోని వెదురుకుప్పం మండలం, పెద్దపంజాణి, శాంతిపురం మండలాల్లోని పలు గ్రామాల్లో ఇటువంటి ఘటనలు జరిగి... ఆవులు మృతి చెందాయి. పశువులు మేత మేసేందుకు వెళ్లే చోట నాటుబాంబులు పెట్టడం ఏంటని జంతు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:పేగు బంధం మరిచి.. ప్రియుడితో కలిసి కన్నకొడుకునే చంపిన తల్లి

ABOUT THE AUTHOR

...view details