తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

దామగుండం అడవుల్లో కాల్పుల కలకలం: ఆవు మృతి - vikarabad latest crime news

తుపాకీతో ఆవుపై దాడి చేసిన ఘటన వికారాబాద్​ జిల్లా దామగుండం అడవుల్లో చోటుచేసుకుంది. గతంలోనూ ఓ సారి కుక్కపై, మరోసారి ఎద్దుపై తుపాకీతో దాడి చేసి చంపారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే తుపాకీతో కాల్చి చంపారా? లేక ఏదైనా పదునైన వస్తువుతో ఆవుపై దాడి చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

a cow died in gun fire at dhamagundam forest
దామగుండం అడవుల్లో కాల్పుల కలకలం: ఆవు మృతి

By

Published : Oct 24, 2020, 10:07 PM IST

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో కాల్పుల కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో ఆవుపై దాడి చేశారంటూ స్థానికులు పోలీసులకు పిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. తుపాకీతో కాల్చి చంపారా? లేక ఏదైనా పదునైన వస్తువుతో ఆవుపై దాడి చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

పూడూరు మండలంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని... ఓ సారి కుక్కపై, మరోసారి ఎద్దుపై తుపాకీతో దాడి చేసి చంపారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పూడూరు మండలంలో అధిక సంఖ్యలో ఫాంహౌస్​లు ఉండడం... దసరా సెలవుల నేపథ్యంలో ఫాంహౌసుల్లో ఉండే వారు.. సరదాగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: తస్మాత్​ జాగ్రత్త: నకిలీ ఐడీలతో సైబర్ నేరగాళ్ల వల

ABOUT THE AUTHOR

...view details