మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుంధతి నగర్లో విద్యుదాఘాతంతో నిఖిల్ అనే బాలుడు మృతి చెందాడు. పది రోజుల క్రితం కాలనీలో గాలిపటం ఎగురవేస్తూ ప్రమాదవశాత్తు కరెంటు తీగలు తగలడంతో నిఖిల్‌కి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గాయాలు తీవ్రం కావడంతో బాలుడు మృతి చెందాడు. శరీరం పూర్తిగా కాలడంతో కిడ్నీలు చెడిపోయి మరణించినట్లు వైద్యులు తెలిపారు.
గాలిపటం ఎగురవేస్తుండగా కరెంట్ షాక్... బాలుడి మృతి - విద్యుదాఘాతంతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో బాలుడు మృతి
జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు మృతి చెందాడు.

గాలిపటం ఎగురవేస్తూ.. కరెంట్ షాక్ తగిలి మృతి
కాగా రెండేళ్ల క్రితం నిఖిల్ తండ్రి మరణించాడు. కుమారుడి మరణంతో తల్లి రోదనలు మిన్నంటాయి. అరుంధతి నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇదీ చదవండి:చిన్నమ్మను హత్య చేసింది.. రెండేళ్ళ తర్వాత దొరికింది!
TAGGED:
telangana crime news