ఆంధ్రప్రదేశ్‌లోని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన వ్యాపారి శివ గణేశ్.. తనకి చెందిన రెండున్నర ఎకరాల స్థలాన్ని కొండారెడ్డి బెదిరించి ఆయన పేరిట రాయించుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కొండారెడ్డితో పాటు మరో 17మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
బెదిరించి మరీ రిజిస్ట్రేషన్..
పొద్దుటూరులో శివ గణేశ్‌కు రెండున్నర ఎకరాల స్థలం ఉంది. ఈ స్థలం వివాదంలో ఉండటంతో వరదరాజులు రెడ్డి బంధువు రామచంద్రారెడ్డిని శివ గణేశ్ సంప్రదించాడు. వివాదం పరిష్కరిస్తే ఎకరం స్థలం ఇస్తానంటూ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో రామచంద్రారెడ్డి వివాదం పరిష్కరించారు. కాగా ఎకరం స్థలంతో పాటు మిగిలిన స్థలాన్నీ తమకు రిజిస్టర్ చేయాలంటూ 9 నెలలుగా వ్యాపారిని కొండారెడ్డి బెదిరిస్తూ వచ్చారు.