కరీంనగర్ జిల్లా రాజీవ్ రహదారిలో తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున 2:30 సమయంలో ముందు వెళ్తున్న లారీని... వెనుక వస్తున్న కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
లారీని ఢీ కొట్టిన కారు... నలుగురికి గాయాలు - కరీంనగర్లో లారీని వెనుక నుంచి ఢీ కొట్టిన కారు
ముందు వెళ్తున్న లారీని వెనుకగా వచ్చిన కారు ఢీ కొట్టిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీ రోడ్డులో జరిగింది.
లారీని ఢీ కొట్టిన కారు... నలుగురికి గాయాలు
హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అతివేగం, నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి:ఏపీకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్