నిజామాబాద్ నగరంలో విషాదం చోటుచేసుకుంది. కంఠేశ్వర్‌లోని శివమ్ అపార్ట్‌మెంట్‌లో కారు కిందపడి 18 నెలల చిన్నారి మృతి చెందింది. కారు తీసే సమయంలో పాప ఆడుకుంటూ ముందుకు వచ్చి నిలబడింది.
చిన్నారిని చిదిమేసిన కారు ప్రమాదం - నిజామాబాద్లో కారు కింద పడి చిన్నారి మృతి
ఓ చిన్నారి అపార్ట్‌మెంట్ సెల్లార్లో హయిగా ఆడుకుంటూ ఓ కారు వద్దకు వెళ్లింది. ఆ కారే తన పాలిట యమపాశంగా మారింది. చిన్నారిని గమనించని డ్రైవర్ ఒక్కసారిగా కారు స్టార్ట్ చేసి దూసుకెళ్లాడు. ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన నిజామాబాద్లో నగరంలో జరిగింది.

చిన్నారిని చిదిమేసిన కారు ప్రమాదం
చిన్నారిని చిదిమేసిన కారు ప్రమాదం
ఆ విషయం గమనించని డ్రైవర్ కారు స్టార్ట్ చేసి ముందుకు పోనివ్వగా.. చిన్నారి టైర్ల కింద పడింది. చనిపోయిన పాప....అదే అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వాచ్‌మెన్ కుమార్తెగా గుర్తించారు.
ఇదీ చూడండి :'ప్రేమించిన యువతిని ఎన్‌కౌంటర్ చేస్తానన్న ప్రియుడు'