ఏపీలోని కడప జిల్లా రాజంపేటలో విద్యుదాఘాతానికి గురై ఓ ఒంటె చనిపోయింది. నెల్లూరు జిల్లా మంచాలపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం... రాజంపేట ప్రాంతంలో ఒంటె సాయంతో ఇంటింటికి తిరుగుతూ.. స్థానికులు ఇచ్చే డబ్బుతో జీవనం సాగిస్తున్నారు. ఇవాళ.. రాజంపేటలోని ఉస్మాన్ నగర్‌లో ఇంటింటికీ తిరుగుతున్న సమయంలో విద్యుత్ తీగలు తగిలి ఆ ఒంటె ఒక్కసారిగా కుప్పకూలింది. కొద్దిసేపు విలవిల్లాడిన ప్రాణాలు విడిచింది. దాన్నే ఆధారంగా చేసుకొని జీవనం సాగిస్తున్న ఆ కుటుంబం దిగ్భ్రాంతికి గురైంది. స్థానికులు.. సుమారు రూ. 30 వేలు వసూలు చేసి బాధిత కుటుంబానికి అందజేశారు.
విద్యుదాఘాతంతో ఒంటె మృతి.. జీవనాధారం కోల్పోయిన కుటుంబం - a camel died in kadapa
ఏపీలోని కడప జిల్లా రాజంపేటలోని ఉస్మాన్నగర్లో వీధుల్లో తిరుగుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తగిలి ఓ ఒంటె మృతి చెందింది. దానిపైనే ఆధారపడి జీవిస్తున్న ఆ కుటుంబం విషాదంలో మునిగింది.
విద్యుదాఘాతంతో ఏడారి ఓడ మృతి.. జీవనాధారం కోల్పోయిన కుటుంబం