హైదరాబాద్లో మరో సైబర్ క్రైమ్ ఉదంతం వెలుగుచూసింది. సికింద్రాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్తకి ఫేస్బుక్లో రెండు నెలల క్రితం అపరిచిత వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దానిని యాక్సెప్ట్ చేసిన కొద్ది రోజులకి సదరు వ్యక్తి నుంచి ఓ సందేశం వచ్చింది. అందులో గత కొద్ది కాలంగా భారత్లోని ఒక కంపెనీ నుంచి తమకు ఆయిల్ సరఫరా అయ్యేదని.. అకస్మాత్తుగా వారి నుంచి ఆయిల్ రవాణా ఆగిపోయిందని తెలిపారు. వారికి సంబంధించిన వివరాలు పంపిస్తామని చెప్పారు. కంపెనీ నుంచి ఆ ఆయిల్ కొనుగోలు చేసి పంపిస్తే దానికి పది రెట్లు చెల్లిస్తామని నమ్మించారు.
అది నమ్మిన ఆ వ్యాపారవేత్త వారిచ్చిన వివరాల ఆధారంగా ఆయిల్ కంపెనీని సంప్రదించి కొనుగోలుకు రూ. 24 లక్షలు చెల్లించాడు. అనంతరం ఇదంతా మోసం అని గ్రహించిన వ్యాపారవేత్త.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.