నిజామాబాద్‌లో తమ కుమారుణ్ని కిడ్నాప్ చేశాడంటూ ఓ వ్యక్తిని చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటనలో విచారణ కొనసాగుతోంది. నిజామాబాద్ మండల పరిషత్ కార్యాలయం వద్ద నాగరాజు అనే వ్యక్తిని.. మంగళవారం మధ్యాహ్నం లక్ష్మీ అనే మహిళ, ఆమె తండ్రితో కలిసి చితకబాది పోలీసులకు అప్పగించింది. తమ కుమారుణ్ని ఈనెల 11న అపహరించాడని బాధితులు తెలిపారు. అప్పటి నుంచి వెతుకుతుండగా... నిజామాబాద్‌లో ఆ వ్యక్తి కనిపించాడని అన్నారు.
లైవ్ వీడియో: బాలుడు అపహరణ!.. కిడ్నాపర్‌కు దేహశుద్ధి - nizamabad dist news
నిజామాబాద్‌లో అపహరణకు గురైన బాలుడి కోసం తల్లిదండ్రులు గాలిస్తున్నారు. ఇదే క్రమంలో తమ కుమారుణ్ని కిడ్నాప్ చేశాడంటూ ఓ వ్యక్తిని ఆ తల్లిదండ్రులరు చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. తమ బిడ్డను నిజామాబాద్‌లో ఈనెల11న అపహరించాడని ఫిర్యాదులో పేర్కొంది.
అయితే నిర్మల్ జిల్లా బాసర రైల్వేస్టేషన్ సమీపంలో ఈనెల 19న ఓ బాలుడి మృతదేహం లభించింది. ఓ వ్యక్తి చిన్నారిని ఎత్తుకుని వెళ్లడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఇదే సమయంలో... నిజామాబాద్‌లో 16నెలల బాలుడు అపహరణకు గురవ్వగా.. బాసరలో చనిపోయిన బాబు, కిడ్నాపైన బాలుడు ఒక్కరేనా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. బాసరలో లభించిన బాలుడి మృతదేహం ఫోటోలు అపహరణకు గురైన చిన్నారి తల్లికి చూపిస్తే... తమ బాబు కాదని చెప్పింది. అయితే నిజనిర్ధారణ కోసం పోలీసులు లక్ష్మీ, అతని తండ్రి, బంధువులను బాసరకు తీసుకెళ్లారు.
ఇవీ చూడండి:భాగ్యనగర యువకుడు.. శకుంతలా దేవిని మించిన గణిత మేధావి