పిల్లలతో పాటు రోడ్డు మీద వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండకపోతే కన్నవారికి కడుపుకోత మిగలొచ్చు. లేదంటే పిల్లలు జీవితాంతం వైకల్యంతో ఉండాల్సి రావచ్చు. తాజాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీబీనగర్‌లో రోడ్డు దాటుతున్న సమయంలో ఓ చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
అకస్మాత్తుగా రోడ్డుపై అడ్డంగా పరుగెత్తిన బాలుడు.. తృటిలో తప్పిన ప్రమాదం - బాలానగర్‌లో రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన బైక్
తల్లిదండ్రులు ఎంత కష్టపడి పనిచేసినా అది వాళ్ల స్వార్థం కోసం కాదు. కేవలం పిల్లల కోసమే.. వారి బాగోగుల కోసమే. వారి జీవితంలో పిల్లలను ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండటం ఆ తల్లిదండ్రులకు చాలా అవసరం. అప్రమత్తంగా ఉండకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఊహించుకోవడమే కష్టం. తాజాగా బాలానగర్‌లో అలాంటి సంఘటన చోటుచేసుకుంది.
రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన బైక్.. తప్పిన ప్రమాదం
బీబీనగర్ ఆస్పత్రి సమీపంలో రోడ్డుపై తల్లితో పాటు నడుచుకుంటూ వెళ్తున్న ఐదేళ్ల బాలుడు తల్లి చేయి వదిలి ఒక్కసారిగా రోడ్డు దాటడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై వస్తున్న వాహనదారుడు బాలుడిని ఢీకొట్టాడు. దీంతో ఆ చిన్నారి బైక్ కింద పడిపోయాడు. అక్కడున్న వాళ్లు బాలుడిని కాపాడారు. ఈ ఘటనలో బాలుడికి గాయాలు కాకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా వాహనదారుడికి స్వల్పగాయాలయ్యాయి.
Last Updated : Dec 25, 2020, 4:24 PM IST