తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మృత్యుంజయుడు... బాలుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం - రాజేంద్రనగర్​లో బాలుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌ రాజేంద్రనగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉప్పర్​పల్లి, అశోక్ విహార్ పేజ్- 2లో కారు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్ల ఓ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. అపార్ట్‌మెంట్‌ ముందు ఆడుకుంటున్న బాలుడిని చూసుకోకుండా కారు నడపటంతో బాలుడి తలకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు... కారు బాలుడి మధ్యలోంచి వెళ్లటంతో ప్రాణాపాయం తప్పింది.

A boy escaped from a car accident
A boy escaped from a car accident

By

Published : Jan 14, 2021, 6:42 PM IST

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలోని ఓ బాలుడు కారు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఉప్పర్​పల్లి అశోక్ విహార్ ఫేజ్ 2లోని ఓ అపార్ట్​మెంట్​లో ఆడుకుంటూ ఉండగా పార్కింగ్ నుంచి బయటకు వెళుతున్న గ్జైలో వాహనం బాలుడిని ఈడ్చుకుంటూ వెళ్లింది. బాలుడు కారు మధ్యలో ఉండటంతో చిన్న పాటి గాయాలతో బయటపడ్డాడు.

గమనించి స్థానికులు తల్లిదండ్రలకు సమాచారం అందించారు. అనంతరం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా... అపార్ట్​మెంట్​లో ఉద్యోగులను దించేందుకు వచ్చిన వాహనంగా గుర్తించిన తల్లిదండ్రులు... పోలీసులకు సమాచారం అందించారు. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మృత్యుంజయుడు... బాలుడికి త్రుటిలో తప్పిన ప్రమాదం

ఇదీ చదవండి :పందెం కోడి కాలు దువ్వింది.. బరిలోకి దునికింది!

ABOUT THE AUTHOR

...view details