కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామానికి చెందిన కోమాకుల చరణ్ శనివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకి వెళ్లి అదృశ్యమయ్యాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విషాదం: అదృశ్యమయ్యాడు.. అనంతలోకాలకు చేరాడు.. - మోయ తుమ్మెద వాగులో పడి బాలుడి మృతి వార్తలు
కరీంనగర్ జిల్లా గుండ్ల చెరువుపల్లి శివారులోని మోయ తుమ్మెద వాగులో ఓ బాలుడి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. 2 రోజుల క్రితం తప్పిపోయిన కోమాకుల చరణ్‌గా గుర్తించారు.
విషాదం: అదృశ్యమయ్యాడు.. అనంతలోకాలకు చేరాడు..
నుస్తులాపూర్ అనుబంధ గ్రామమైన గుండ్ల చెరువుపల్లి శివారులోని మోయ తుమ్మెద వాగు వద్ద సోమవారం బాలుడి దుస్తులు లభ్యమయ్యాయి. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు జాలర్ల సాయంతో మృతదేహాన్ని వెలికితీశారు. శవం కుల్లిపోయి ఉండటం వల్ల ఘటనా స్థలిలోనే పంచనామా నిర్వహించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీచూడండి.. ఆమె లేకుండా బతకలేను.. మా పిల్లల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి