తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రియుడి ఇంటి ముందు ప్రేయసి నిరసన - undefined

ప్రేమించి వివాహం చేసుకుంటానని చెప్పిన ప్రియుడు ముఖం చాటేశాడు. తనని కలవాలని ప్రయత్నిస్తే తప్పించుకుని తిరుగుతున్నాడు. న్యాయం చేయాలని కోరుతూ.. ప్రియుడి ఇంటి ముందు నిరసనకు దిగింది ఓ ప్రియురాలు.

ప్రియుడు ఇంటి ముందు ప్రేయసి నిరసన

By

Published : Mar 31, 2019, 5:39 AM IST

Updated : Mar 31, 2019, 1:08 PM IST

ప్రియుడు ఇంటి ముందు ప్రేయసి నిరసన
వారిద్దరు బాల్యమిత్రులు. ఒకే ఊరు, ఒకే పాఠశాలలో చదువుకున్నారు. కొన్నాళ్లకు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వెళ్లారు. ఇద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమకు దారితీసింది. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇంతలో ప్రియుడు ముఖం చాటేశాడు. న్యాయం కోసం ప్రియుడి ఇంటి ముందు నిరసన చేపట్టింది. మహబూబ్​నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం మద్దూరు గ్రామానికి చెందిన ఓ అమ్మాయి, మోహన్​కుమార్ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుందామనుకుని ఐదేళ్ల పాటు సహజీవనం చేశారు. ప్రేమించిన అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లి.. తనని ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు ప్రియుడు​.పెళ్లి చేస్తామని చెప్పి..
మోహన్ తరఫు బంధువులు కూడా పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత ప్రియుడు ముఖం చాటేశాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా... వారు ఇరు వర్గాల బంధువులను పిలిపించి ఒప్పించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. ఆరు నెలలుగా ప్రియుడి ఇల్లు తాళం వేసి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇంటి ముందు బైఠాయించి..
చివరకు ఏం చేయాలో పాలుపోక ప్రేమించిన అబ్బాయి ఇంటి ఎదుట నాలుగు రోజులుగా న్యాయం కోసం నిరసన వ్యక్తం చేస్తోంది. తమ ఇద్దరి మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని... అబ్బాయి తరఫు బంధువులు వివాహానికి అడ్డుపడుతున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనను ప్రేమించిన బాల్య స్నేహితుడితో వివాహం జరిపించాలని కోరుతోంది.
Last Updated : Mar 31, 2019, 1:08 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details