బిహార్ రాష్ట్రానికి చెందిన అమిత్ మిశ్రా అనే యువకుడు బ్రతుకు తెరువు కోసం వచ్చాడు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం గండెగూడ గ్రామంలో ఉన్న అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ బొల్లారం గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అమిత్ బిహార్ నుంచి వచ్చి 45 రోజులే అయ్యింది.
ఉరేసుకుని బిహార్‌కు చెందిన వ్యక్తి బలవన్మరణం - సంగారెడ్డి జిల్లాలోని ఓ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
బిహాార్ రాష్ట్రం నుంచి వచ్చి కొద్దిరోజులే అయ్యింది. ఓ పరిశ్రమలో కాపాలాదారునిగా కూడా పనికి కుదిరాడు. అంతాబాగుంది అనుకునేలోపే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా గండెగూడ గ్రామంలో జరిగింది.
ఓ పరిశ్రమలో ఉరేసుకుని బీహార్‌కు వ్యక్తి బలవన్మరణం
అయితే ఆదివారం ఉదయం పరిశ్రమలోని షెడ్‌పై ఉన్న ఇనుప కమ్మికి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతనికి ప్రేమ వ్యవహారం ఉందని స్నేహితులు చెబుతున్నారు. ప్రేమ విఫలమైందా లేక ఇతర కారణాలు ఏమైనా అతని మరణానికి దారితీశాయనా..? అని పోలీసులు విచారిస్తున్నారు.