నిర్మల్ జిల్లా సొన్ మండలం జాప్రాపూర్ గ్రామానికి చెందిన బాలిక (13)పై అదే గ్రామానికి చెందిన దుమ్మల శ్రీనివాస్ అనే వ్యక్తి లైంగిక దాడికి యత్నించాడు. బాలిక పక్కింటికి వెళ్తుండగా అక్కడే ఉన్న శ్రీనివాస్ మాయమాటలతో నమ్మించాడు. అనంతరం ద్విచక్రవాహనంపై స్వర్ణ నది పరివాహాక ప్రాంతానికి తీసుకెళ్తుండగా అనుమానం వచ్చి బాలిక ఎక్కడికి వెళ్తున్నాం అని ప్రశ్నించే లోపు పొదల మధ్యలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికంగా ఉన్న పశువుల కాపరిని గుర్తించిన నిందితుడు... ఆ బాలికను తిరిగి ఇంటికి తీసుకెళ్లాడు. జరిగిన విషయం ఎవరికైన చెబితే చంపేస్తానని బెదిరించాడు.
కామంతో 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యం - నిర్మల్ జిల్లా క్రైం న్యూస్
కామంతో కళ్లు మూసుకుపోయిన మానవ మృగం పైశాచికత్వానికి ఒడిగట్టాడు. అభం శుభం తెలియని చిన్నారిపై అఘాయిత్యానికి పూనుకున్నాడు. మానవత్వం లేని ఓ మృగం 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించిన ఘటన నిర్మల్ జిల్లా జాప్రాపూర్ గ్రామంలో జరిగింది.
13 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం... నిందితుడికి రిమాండ్
తల్లిదండ్రులకు అనుమానం వచ్చి బాలికను అడగగా జరిగిన విషయం చెప్పింది. వెంటనే బాధిత బాలిక తల్లిదండ్రులు సొన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు నిందితున్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచి అనంతరం ఆదిలాబాద్ జైలుకు తరలించారు.
ఇదీ చూడండి:ప్రధాని పదవికే వన్నె తెచ్చిన 'పీవీ'