మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో విద్యుదాఘాతంతో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన ఎల్లు హరీశ్(15) విద్యుత్ మోటారు పెట్టి.. పైపును సరి చేస్తున్న క్రమంలో దుర్మరణం చెందాడు.
గ్రామానికి చెందిన ఎల్లు నాగేశ్, ఉమ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరి పెద్ద కుమారుడు హరీశ్. తొర్రూరులోని ఒక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనుల్లో తండ్రికి తోడుగా నిలుస్తున్నాడు. మధ్యాహ్నం దుక్కికి నీరు పెట్టేందుకు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. బోరు బావి మోటార్ పెట్టిన అనంతరం నీళ్లు పొసే పైపును సరి చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.