తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

103 ఏళ్లు ఆరోగ్యంగా జీవించాడు.. చివరికి అనారోగ్యంతో మరణించాడు - 103 ఏళ్ల వృద్ధుడు మృతి వార్తలు

నిత్యం వ్యవసాయ పనులు చేసుకుంటూ ఆరోగ్యంగా జీవించిన 103 ఏళ్ల ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు కిందపడి.. అనారోగ్యంతో మృతి చెందాడు. వృద్ధుడిని చివరిసారిగా చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరిచారు. ఈ ఘటన మహబూబ్​నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

a-103-year-old-man-has-died-in-mahabubnagar-district
103 ఏళ్లు ఆరోగ్యంగా జీవించాడు.. చివరికి అనారోగ్యంతో మరణించాడు

By

Published : Sep 13, 2020, 2:31 PM IST

మహబూబ్​నగర్ జిల్లా దేవరకద్రకు చెందిన కొండాపురం హనిమిరెడ్డి(103) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించారు. ఈయనకు నలుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు కాగా.. భార్య పుల్లమ్మ 30 ఏళ్ల కిందట మృతి చెందింది.

అప్పటి నుంచీ కుమారుల సంరక్షణలోనే వ్యవసాయ పనులు చూసుకుంటూ ఆరోగ్యంగా జీవించిన హనిమిరెడ్డి.. 3 రోజుల క్రితం తన సొంత పనులు చేసుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడ్డారు. ఈ క్రమంలోనే అనారోగ్యంతో శనివారం మృతి చెందారు. 103 ఏళ్లు ఆరోగ్యంగా జీవించిన హనిమిరెడ్డిని చివరి సారిగా చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు.

ఇదీచూడండి.. అక్రమంగా నిల్వ ఉంచిన పొగాకు సీజ్​

ABOUT THE AUTHOR

...view details