నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని నందిపాడు బైపాస్ వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న 90 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నందిపాడు బైపాస్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా... ఒక కారులో గంజాయి బ్యాగులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.40 వేలు, ఒక కారు, 3 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
90 కిలోల గంజాయి స్వాధీనం... ఐదుగురు అరెస్ట్ - ganjai caught news
విశాఖపట్నం నుంచి రాష్ట్రానికి గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను నల్లగొండ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 90 కిలోల గంజాయితో పాటు రు.40 వేలు, ఓ కారు, 3 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
90 kilograms of ganja caught by police in miryalaguda
నవీన్, అఖిల్, నందిని, పార్వతి, శాంతభాయి.. గత మూడు నెలల నుంచి విశాఖపట్టణం సీలేరులోని సతీశ్, సురేశ్ నుంచి గంజాయి సరఫరా చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ గంజాయిని జహీరాబాద్, హైదరాబాద్ ప్రాంతాల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వివరించారు. అఖిల్, నవీన్ మిర్యాలగూడలో ఒకరి గదిలో గంజాయిని భద్రపరిచి చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి యువకులకు విక్రయిస్తున్నారని వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.