సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో మట్కా నిర్వహిస్తున్న మహమ్మద్ ఉస్మాన్ ఇంట్లో పోలీసులు దాడులు చేశారు. ఉస్మాన్‌తో పాటు మట్కా ఆడేందుకొచ్చిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి లక్ష 66 వేల రూపాయలను, 9 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
మట్కా ఆడుతున్న 9 మంది అరెస్ట్.. - matka ply in sangareddy
అంతర్జాలం సాయంతో మట్కా నిర్వహిస్తున్న నిర్వాహకుడితో పాటు తొమ్మిది మందిని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి పెద్ద ఎత్తున నగదు, చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
9 arrested in patancheru for playing matka
మహమ్మద్ ఉస్మాన్ వద్దకు మట్కా ఆడేందుకు వచ్చిన వారి పేర్లను పటాన్‌చెరుకు చెందిన మట్కా ఏజెంట్ గోలి అనే వ్యక్తికి ఇస్తే.. వారి పేర్లను అంతర్జాలం సాయంతో ముంబయిలో జరిగే మట్కా ఆటకు నమోదు చేస్తుండేవాడు. చదువు రాని వారి వివరాలు మాత్రం మహమ్మద్ ఉస్మాన్ చీటీ రాసేవాడు. ఇలా మట్కాలో గెలుచుకుంటే సాయంత్రానికి వచ్చిన డబ్బులు ఆడిన వారికి ఇచ్చేవాడు. త్వరలోనే మట్కా ఏజెంట్ గోలి అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.