ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలంలోని ఓ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని గర్భం దాల్చింది. కరోనా సెలవుల అనంతరం పాఠశాలకు వచ్చిన ఆమె తరచూ అనారోగ్యంపాలవుతుండటంతో ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించారు. రంపచోడవరం ప్రభుత్వాసుపత్రికి పంపించగా గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధరించారు.
గర్భం దాల్చిన విద్యార్థిని... కంగుతిన్న ఉపాధ్యాయులు... - East Godavari District Rampachodavaram News
కరోనా అనంతరం పాఠశాలకు వచ్చిన ఓ విద్యార్థిని అస్వస్థతకు గురైంది. ఆమెను ఆస్పత్రికి తరలించిన ఉపాధ్యాయులను... వైద్యులు చెప్పిన సంగతి షాక్కు గురి చేసింది. ఆమె గర్భందాల్చిందన్న విషయం తెలుసుకున్న యాజమాన్యం కూడా కంగుతిన్నది.
గర్భం దాల్చిన విద్యార్థిని... కంగుతిన్న ఉపాధ్యాయులు...
విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ప్రస్తుతం బాలిక కుటుంబ సభ్యులు సమక్షంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది.
ఇవీ చదవండి:ఫోర్బ్స్ జాబితాలో నల్గొండ యువకుడు.. కేటీఆర్ అభినందన