తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

టోల్​ప్లాజా వద్ద 686 కిలోల వెండి స్వాధీనం - ap crime news

ఏపీలోని కర్నూలు జిల్లాలో భారీగా వెండి పట్టుబడింది. జిల్లాలోని డోన్ మండలం అమకతాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సుమారు 686 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు.

silver
టోల్​ప్లాజా వద్ద 686 కిలోల వెండి పట్టివేత

By

Published : Dec 11, 2020, 12:38 PM IST

Updated : Dec 11, 2020, 3:43 PM IST


ఆంధ్రప్రదేశ్​ కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి మండలం పరిధిలోని జాతీయ రహదారిపై డోన్ మండలంలోని అమకతాడు టోల్ ఫ్లాజా వద్ద అనుమతి లేకుండా తరలిస్తున్న వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం భారీగా వెండిని తరలిస్తున్నట్లు సమాచారం రావటంతో టోల్​ప్లాజా వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.

ఛత్తీస్​గఢ్​లోని రాయచూర్ నుంచి తమిళనాడులోని సేలం వెళ్తున్న కారు వెనుక భాగంలో సంచుల్లో ఉన్న వెండిని గుర్తించారు. దాదాపు 686 కిలోల మేర ఉండవచ్చని, దీని విలువ దాదాపు రూ.4.35 కోట్లుగా పోలీసులు భావిస్తున్నారు. బాలుడితో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

Last Updated : Dec 11, 2020, 3:43 PM IST

ABOUT THE AUTHOR

...view details