తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

హైదరాబాద్ శివారులో గంజాయి ముఠా గుట్టు రట్టు - హైదరాబాద్​లో గంజాయి స్వాధీనం

గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని మేడ్చల్ జిల్లా కొంపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. 60కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌లో సరఫరా చేస్తుండగా డ్రైవర్ సమాచారంతో గంజాయి గుట్టురట్టయింది.

ganza
ganza

By

Published : Jul 6, 2020, 3:46 PM IST

హైదరాబాద్ శివారు కొంపల్లి వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి పరారయ్యాడు. ఏపీలోని అనకాపల్లి నుంచి హైదరాబాద్‌కు ఆరెంజ్ ట్రావెల్స్‌ బస్సులో రెండు బ్యాగులను ట్రాన్స్‌పోర్ట్‌ కోసం బుక్‌ చేసుకున్నారు. ఆదివారం ఉదయం బస్సు కొంపల్లి వద్దకు రాగానే ఆపి ఆ బ్యాగులను ఇవ్వాలని సంజయ్, సిరాజుద్దీన్ అనే వ్యక్తులు డ్రైవర్‌ను అడిగారు. మధ్యలో ఇవ్వడం కుదరదని డ్రైవర్ నిరాకరించడంతో వాగ్వాదానికి దిగారు. ట్రావెల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

బ్యాగులను తమ వాహనంలోకి షిఫ్ట్ చేస్తుండగా పోలీసులు రావడం చూసి ప్రధాన నిందితుడు సంజయ్ పరారయ్యాడు. సిరాజుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ బ్యాగులను పరిశీలించగా అందులో 60 కిలోల గంజాయిని గుర్తించారు. నిందితుడిని పోలీసులు విచారించగా అనకాపల్లి నుంచి నగరానికి రవాణా చేస్తున్నట్లుగా తెలిసింది. వీళ్లకి మరో వ్యక్తి సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

సరకు రవాణా చేసేటప్పుడు వాటిని పరిశీలించాలని బాలనగర్ డీసీపీ పద్మజ సూచించారు. లేదంటే రవాణా సంస్థలపై చట్టపరమైన చర్యలుంటాని హెచ్చరించారు.

ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details