సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. హరితహారం మొక్కలు దింపి వస్తున్న గ్రామ పంచాయతీ ట్రాక్టర్ కిందపడి బోనాల యుగేందర్(5) అనే బాలుడు మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
సీతానగరంలో ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి - 6 years old boy died in accident at seethanagaram
ట్రాక్టర్ కిందపడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరం గ్రామంలో చోటుచేసుకుంది.
సీతానగరంలో ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి
బాలుడి తల్లి స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మునగాల ఎస్సై సత్యనారాయణ గౌడ్ తెలిపారు.
ఇదీ చూడండి:సీఎం ఇంటి ముందే యువకుడి ఆత్మాహుతి యత్నం