నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం బలనుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పూరిగుడిసె మట్టిగూడ కూలి ఆరేళ్ల చిన్నారి మృతి చెందింది. బలనుపల్లికి చెందిన మమత, భీమయ్య దంపతులు పూరి గుడిసెలో నివాసముంటున్నారు. గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గుడిసె గోడ తడిసి ముద్దయింది. ఇది గమనించకుండా వారు అందులోనే నివాసముంటున్నారు.
పూరిగుడిసె మట్టిగోడ కూలి ఆరేళ్ల చిన్నారి మృతి
పూరిగుడిసె మట్టిగోడ కూలి ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన విషాద ఘటన నాగర్కర్నూల్ జిల్లా బలనుపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పూరిగుడిసె మట్టిగోడ కూలి ఆరేళ్ల చిన్నారి మృతి
ఈరోజు తెల్లవారుజామున అందరు నిద్రిస్తుండగా అకస్మాత్తుగా గోడకూలి బాలికపై పడింది. దీంతో బాలిక తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటనతో తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనలు చూసి అందరూ కంటతడి పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి: కంటైనర్ ఢీకొట్టి సెక్యూరిటీ గార్డు మృతి