హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రమేయం లేకుండానే సైబర్ నేరగాళ్లు అతడి ఆరు బ్యాంకుల నుంచి ఆరు లక్షల రుణం తీసుకున్నారు. సిబిల్ స్కోర్ నేపథ్యంలో ఈ విషయం వెలుగులో వచ్చింది. యూసుఫ్‌గూడ ప్రాంతానికి చెందిన సునీల్ కుమార్ ప్రైవేటు ఉద్యోగి... ఇటీవల ఆయన తన సిబిల్ రిపోర్ట్ చూసుకున్నారు. అందులో స్కోర్ చాలా తక్కువగా ఉండటంతో ఆరా తీశాడు.
సునీల్ ఆరు బ్యాంకుల్లో లక్ష చొప్పున రుణం తీసుకున్నట్లు...ఆ మొత్తాలు చెల్లించకపోవడంతో డిఫాల్డ్ అయినట్లు తెలుసుకున్నాడు. అయితే ఈ రుణాల విషయం తనకు తెలియదంటూ సునీల్ వాపోయాడు. బాధితుడి పాన్‌కార్డ్‌తో సైబర్ నేరగాళ్లు... ఆన్‌లైన్‌లో ఇన్‌స్టంట్ లోన్ సదుపాయంతో ఈ రుణాలు పొందారని వెల్లడైంది.