ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలోని మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి చెందిన కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. కార్యాలయం బీరువాలో ఉంచిన రూ.51 లక్షలు అపహరణకు గురైంది. పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ నవీన్ మూర్తి ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కార్యాలయ సిబ్బంది.. ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
మేఘా ఇంజినీరింగ్ కంపెనీలో 'మెగా చోరీ'.. పట్టుబడిన నగదు - మేఘా ఇంజినీరింగ్ కంపెనీలో చోరీ వార్తలు
ఏపీ పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ పనులు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ కంపెనీ కార్యాలయంలో భారీ చోరీ జరిగింది. పోలీసులు విచారణ చేపట్టి.. కేసు ఛేదించారు.
మేఘా ఇంజినీరింగ్ కంపెనీలో 'మెగా చోరీ'.. పట్టుబడిన నగదు
అనంతరం సీసీ ఫుటేజీని పరిశీలించారు. అపహరణకు గురైన నగదు ప్రకాశం జిల్లాలో పట్టుబడింది. రూ.51 లక్షలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెక్యూరిటీ గార్డు మధుసూదనరెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
ఇదీ చదవండి:కొత్త సచివాలయ పనులు అక్టోబర్‌లో ప్రారంభించే అవకాశం