కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున దొంగలు తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. హౌసింగ్ బోర్డ్ మూడో ఫేజ్ భువన విజయం మైదానం సమీపంలో ఒకే రోజు రెండు ఇళ్ల తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. మూడో ఫేజ్‌లో నివాసముండే వీరవల్లి చంద్రనారాయణ ఆగస్టు 16న సొంత ఊరికి వెళ్లాడు. ఆగస్టు 29న ఉదయం 9 గంటలకు వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఇంటి లోపలికి వెళ్లి చూడగా బంగారు పుస్తెలతాడు, నెక్లెస్, రింగులు, నగదు, తదితరాలు కోల్పోయినట్లుగా గమనించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేపీహెచ్బీలో 50 తులాల బంగారం, కిలో వెండి చోరీ - Theft within KPHB police station area
కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో దొంగలు విరుచుకుపడ్డారు. తాళాలు వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొరికిన కాడికి దోచుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు ఇళ్లలో కలిపి సుమారు 50 తులాల బంగారం, కిలో వెండి దోచుకెళ్లినట్లుగా తెలిసింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అదే రోజు మూడో పేజ్‌లో నివాసముండే సుధీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి భాగ్యనగర్ కాలనీలోని బంధువుల ఇంటికి ఆగస్టు 26న వెళ్లి ఆగస్టు 30న ఉదయం ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళాలు పగులగొట్టి కనిపించాయి. లోపలికెళ్లి చూడగా నాలుగు బంగారు గాజులు, రెండు జతల బుట్టాలు, రెండు చైన్లు, రెండు పెద్ద గొలుసులు, ఐదు రింగ్‌లు, స్టోన్ నెక్లెస్ తదితర పలు రకాల వెండి సామాగ్రి దొంగిలించినట్లుగా నిర్ధారించుకుని పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి :శ్రీలక్ష్మీనరసింహస్వామికి కానుకలు బహుకరించిన దాతలు