నకిలీ చెక్కుతో భారీ నగదు కాజేసేందుకు యత్నించిన నలుగురు వ్యక్తులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీలో ఉండే శ్రవణ్ తన వద్ద న్యూ దిల్లీ మున్సిపాలిటీకి చెందిన రూ.9కోట్ల 95 లక్షల చెక్కు ఉందని నాచారానికి చెందిన భాస్కర్ గుప్తాకు చెప్పాడు. అతను ఉపేందర్ అనే వ్యక్తిని కలిశాడు. వారు చిలుకానగర్‌లో ఉండే సరిత, జంపయ్యతో మాట్లాడి వారి జీఎంఎల్ ఏరోస్పేస్ కంపెనీ కరెంట్ అకౌంట్లో చెక్కు వేసుకునేలా ఒప్పించారు.
నకిలీ చెక్కుతో కాజేయాలనుకున్నారు... కానీ! - హైదరాబాద్ తాజా వార్తలు
దిల్లీలో నివాసం ఉండే ఓ వ్యక్తి నకిలీ చెక్కుతో నగదు కాజేయడానికి యత్నించాడు. అందుకు తగినట్లుగా తనతోపాటు మరికొంత మందిని పోగు చేశాడు. పక్కా ప్లాన్‌తో నకిలీ చెక్కును తీసుకొని ఉప్పల్ ప్రశాంత్ నగర్ ఎస్బీఐకి వెళ్లారు. అధికారులకు అనుమానం రావడంతో తీగ లాగితే డొంక కదిలింది.
నకిలీ చెక్కుతో కాజేయాలనుకున్నారు!
ఉప్పల్ ప్రశాంత్ నగర్ ఎస్బీఐలో చెక్కు వేశారు. బ్యాంకు అధికారులకు అనుమానం రావడంతో దిల్లీకి ఫోన్ చేయగా... అది నకిలీ చెక్కు అని తేలింది. వెంటనే బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరిత, జంపయ్య, భాస్కర్ గుప్తా, ఉపేందర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ రంగస్వామి తెలిపారు. శ్రవణ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:ముగ్గురు పిల్లలను చెరువులోకి తోసి.. ఆత్మహత్య చేసుకున్న తల్లి