తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కుక్కల దాడిలో ఐదు మేకలు మృతి - goats died

ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ గ్రామంలో మేకల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 5 మేషాలు మృత్యువాతపడ్డాయి. సుమారు రూ.70 వేల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.

5 goats died in dogs attack in both village
5 goats died in dogs attack in both village

By

Published : Oct 10, 2020, 12:19 PM IST

ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ గ్రామానికి చెందిన గోర్ల బోజన్నకి చెందిన మేకలు కుక్కల దాడిలో మృతి చెందాయి. శుక్రవారం రాత్రి కొట్టంలో ఉన్న మేకల మందపై కుక్కలు దాడి చేసి 5 మేకలను చంపేశాయి. సుమారు రూ. 70 వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు అంచనా వేశాడు.

మేకల మందపై కుక్కల దాడి... 5 మేషాలు మృత్యువాత

ఘటన స్థలాన్ని సర్పంచ్ సురేందర్ యాదవ్ పరీశీలించారు. వెంటనే జిల్లా పంచాయతీ అధికారితో మాట్లాడి కుక్కల బెదడ తగ్గించాలని ఆదేశించారు. ప్రభుత్వానికి నివేదిక పంపి ఆర్థిక సాయం అందేలా చేస్తామని సర్పంచ్ భరోసా ఇచ్చారు.

ఇదీ చూడండి:లారీని ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details