తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

గూడ్స్​ రైలు ఢీకొని 45 మేకలు మృతి - గూడ్స్​ రైలు ఢీకొని 45 మేకలు మృతి

గూడ్స్​ రైలు ఢీకొని 45 మేకలు మృత్యువాత పడిన ఘటన ఆదిలాబాద్​ జిల్లాలోని ఖోడద్​ సమీపంలో చోటుచేసుకుంది. మరణించిన మేకల విలువ దాదాపుగా రూ.4.5 లక్షలు ఉంటాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

45 goats died in train accident in adilabad district
గూడ్స్​ రైలు ఢీకొని 45 మేకలు మృతి

By

Published : Oct 10, 2020, 9:58 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలం ఖోడద్‌ సమీపంలో గూడ్స్​‌ రైలు ఢీకొని 45 మేకలు మృత్యువాత పడ్డాయి. ఖోడద్‌ గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్‌ ఉదయం మేతకు తీసుకెళ్లిన తన 60 మేకలతో సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో పట్టాలు దాటుతుండగా గూడ్స్‌ రైలు‌ ఢీకొంది.

దాంతో పట్టాల వెంట 45 మేకలు మృత్యువాతపడ్డాయి. మరణించిన మేకల విలువ దాదాపుగా రూ. 4.5లక్షలు ఉంటాయని బాధితుడు తెలిపాడు.

ఇవీ చూడండి: మద్యం మత్తులో డ్రైవింగ్.. మూడు పల్టీలు కొట్టిన కారు

ABOUT THE AUTHOR

...view details