హైదరాబాద్ కాలాపత్తర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అలీబాగ్ సమీపంలోని ఓ ఇంట్లో అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని నిల్వ చేస్తున్నారంటూ పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు కాలాపత్తర్ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల బియ్యం పట్టివేత - అక్రమ రేషన్ బియ్యం పట్టివేత వార్తలు
అక్రమంగా బియ్యాన్ని నిల్వ చేసిన ఇంటిపై హైదరాబాద్ పాతబస్తీ డివిజన్ పరిధిలోని కాలాపత్తర్ పోలీసులు దాడి చేశారు. ఆ ఇంట్లోంచి 40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు.
అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
పోలీసులు తనిఖీలు నిర్వహించగా.. 40 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా బియ్యాన్ని నిల్వ ఉంచుతున్న వసీం అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సివిల్స్ సప్లై అధికారులకు అప్పజెప్పినట్లు పోలీసులు వివరించారు.
ఇదీ చూడండి:ఆన్లైన్ పాఠాలతో ఫోన్ బిల్లుల మోత!