ఆదిలాబాద్‌లోని కుర్దిద్నగర్, సుందరయ్యనగర్‌లోని పలువురు పానీపూరి తిని అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు చేసుకోవడం వల్ల వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో 30 మందికి పైగా పిల్లలున్నారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
పానీపూరి తిన్నారు.. ఆస్పత్రి పాలయ్యారు.! - పానిపూరి తిని 40 మందికి అస్వస్థత
పానీపూరి తిని 40 మంది అస్వస్థతకు గురైన ఘటన ఆదిలాబాద్‌లోని కుర్దిద్నగర్, సుందరయ్యనగర్‌లో చోటుచేసుకుంది. వీరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అస్వస్థతకు గురైన వారిలో 30 మందికి పైగా పిల్లలు ఉన్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు