మహబూబాబాద్‌లో ఇటీవల జరిగిన దీక్షిత్‌రెడ్డి హత్య కేసులో నిందితుడు సాగర్‌ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాగర్‌ను 4 రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది.
చిన్నారి హత్య కేసులో నిందితునికి 4 రోజుల కస్టడీ - custody for deekshit reddy kidnap case
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 18న కిడ్నాప్‌కు గురైన దీక్షిత్ రెడ్డిని హత్య చేసిన కేసులో నిందితున్ని విచారణ చేసేందుకు కస్టడీలోకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు సాగర్‌ను 4 రోజుల పాటు కస్టడీలోకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది.
చిన్నారి హత్య కేసులో నిందితునికి 4 రోజుల కస్టడీ
స్థానిక సబ్ జైలులో ఉన్న సాగర్‌ను కస్టడీలోకి తీసుకొని పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ నాలుగు రోజుల పాటు పోలీసులు సాగర్‌ను పలు కోణాల్లో విచారించనున్నారు.